ఇదంతా వాళ్ళు చేసిందే..2014 ఎన్నికల ముందు కూడా అలాగే చేశారు

ys-sharmila
ys-sharmila

సామాజిక మాధ్యమాల్లో ఆసత్య ప్రచారంపై వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు వస్తున్నందువల్లే ఇలా ప్రచారానికి తెరతీశారన్న షర్మిళ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీదేనని మండిపడ్డారు… షర్మిలతో పాటు ఏ మహిళపై ఇలాంటి దుష్ప్రచారం జరిగినా ఖడిస్తుందన్నారు టీడీపీ నేతలు.

సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాలు రాజకీయదుమారాన్ని దారితీస్తున్నాయి. హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిళ . ఆసత్యాలతో తనపై దుష్ర్పచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ దుష్ర్పచారాల వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఆరోపణలు పుట్టించడం టీడీపీకి కొత్తకాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఫ్యాక్షనిస్ట్‌ అని, తన సోదరుడు జగన్‌ని గర్విష్టి అని టీడీపీ పుకార్లు పుట్టించిందని అన్నారు. ఇలాంటి వదంతులను చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు . 2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారలే చేశారన్నారు .

ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా నైతికతను, నిజాయితీని నిరూపించుకోవల్సిన అవసరం లేదన్నారు . తన జీవితంలో ప్రభాస్‌ను తాను ఎప్పుడూ కలవలేదని… అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తుతున్నారని అన్నారు.. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపలేదని ఆమె ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దుష్ర్పచారం.. మహిళల గౌరవంపై జరుగుతున్న దాడిగా ఆమె చెప్పారు.

ఆంధ్రా పోలీసులపై తమకు నమ్మకం లేదని.. అందుకే హైదరాబాద్ వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వైసీపీ నేతలు. సీఎం చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు. పోస్టింగ్ పెట్టిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తమ పార్టీ నేతలపై ఆసత్య ప్రచారంచేస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు షర్మిళ చేసిన ఆరోపణలను ఖండించారు టీడీపీ నేతలు. తమ పార్టీ మహిళలను గౌరవిస్తుందని.. చంద్రబాబు ఎట్టిపరిస్థితిల్లోనూ ఇలాంటి వాటిని ప్రోత్సహించరని అన్నారు. మహిళా శాసన సభ్యులను సైతం కంటతడి పెట్టించిన వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు. షర్మిలతో పాటు ఏ మహిళపై ఇలాంటి దుష్ప్రచారం జరిగినా టీడీపీ ఖడిస్తుందన్నారు. షర్మిల తెలంగాణలో కాకుండా ఏపీలో ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదన్నారు టీడీపీ నేతలు .

ఆటు షర్మిళ ఇచ్చిన ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ విభాగానికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ బదిలీ చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై సెక్షన్‌ 67 ఐటీ యాక్ట్ 2000 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు .