వీడియో:ఈ ఘనులు బర్త్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా !

video going viral on social media shows a man shooting at a cake.
video going viral on social media shows a man shooting at a cake.

బర్త్‌డే కేక్‌ను కత్తితో కట్‌చేసి సెల్‌బ్రేట్‌ చేసుకుంటాం. కానీ అందులో కిక్‌ ఏముంటుందని అనుకున్నారో ఏమో… నలుగురు కుర్రాళ్లు తమ స్నేహితుడి పుట్టినరోజు వైవిధ్యంగా జరపాలని ప్లాన్‌ వేశారు. ఇందులో భాగంగా నడిరోడ్డుపై కేకును ఉంచిన యువకులు….దాన్ని గన్‌తో షూట్‌ చేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో యూ ట్యూబ్‌లో అప్లోడ్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నప్పటికి.. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఈ తరహా సెలెబ్రేషన్‌ మీరట్‌లో జరిగిందన్న వార్తలను ఆ నగర పోలీసులు ఖండిస్తున్నారు.