పేటియం వినియోగదారులకు శుభవార్త.. రూ.7500 క్యాష్ బ్యాక్

paytm-cash-back-offer

వాహనదారుల కోసం పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుని పేటీఎం యాప్ ద్వారా నగదును చెల్లించేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ ద్వారా రూ 7500 వరకు క్యాష్ బ్యాక్ లభించనున్నట్లుగా కంపనీ ప్రకటించింది. రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి
పేటీఎం ఎంపిక చేసిన బంక్‌లోనే పెట్రోల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్‌లో ఉన్న బంక్‌ల పేర్లు తెలుసుకోవడం కోసం పేటీఎం యాప్‌కి వెళ్లి ధృవీకరించుకోవచ్చు. కనీసం రూ 50 పేట్రోల్ లేదా డిజిల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ 2018 ఆగస్ట్ 1న ప్రారంభమైంది. 2019 ఆగస్ట్ 1న ముగుస్తుంది.

ఆఫర్ పోందే విధానం:-


ఇంధనం పోయించుకున్న తర్వాత పేటీఎం యాప్ ద్వారా చెల్లింపులు జరపాలి. తర్వాత వినియోగదారుడికి పేటీఎం నుంచి మెసేజ్ వస్తుంది.
మెసేజ్‌పైన క్లిక్ చేయాలి. ఆ లింక్ డైరక్ట్‌గా పేటీఎంలోని క్యాష్ బ్యాక్ ఆఫర్ల విభాగంలో ఓపెన్ అవుతుంది. దీంతో మీరు చేసిన మెుదటి లావాదేవి ధృవీకరించబడుతుంది.
48 గంటల్లోపు SMS ద్వారా నమోదు చేసిన నంబర్ కి ప్రోమో కోడ్లను పొందుతారు. ఈ ప్రోమో కోడ్‌ను తదుపరి జరిపే లావాదేవికి ఉపయోగించుకోవచ్చు.
ఇలా దాదాపు రూ 7500 వర్త్ గల ప్రోమో కోడ్‌లను పొందవచ్చు
పేటీఎం యాప్ ద్వారా చేసే 11వ 21వ 31వ 41వ ట్రాన్సాక్షన్ ద్వారా పుల్ క్యాష్ బ్యాక్‌ వస్తుంది.