పోర్న్‌ స్టార్‌గా రమ్యకృష్ణ!

ramya-krishna-act-porn-star-super-deluxe

బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుత నటన కనబర్చిన రమ్యకృష్ణ ఇప్పుడు మరో విభిన్న పాత్రలో నటించనుంది. ఓ తమిళ సినిమా కోసం పోర్న్‌స్టార్‌ పాత్రలో కనిపించనున్నారు రమ్యకృష్ణ. విజయ్‌ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో.. రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనున్నారు.

Also read : అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకెళుతోంది : గవర్నర్

ఈ మేరకు సినిమా విశేషాలను దర్శకనిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. శృంగార తార పాత్రకు ముందుగా సీనియర్ నటి నదియాను సంప్రదించగా ఆమె తిరస్కరించింది. దాంతో రమ్యకృష్ణను కోరగా ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను మర్చి లేదా ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Recommended For You