ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ కూతురు!

kedarnath, sara ali khan dating with sushant, sara ali khan viral news, sara ali khan,

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలుగా వెండితెరపై మెరిసింది సారా అలీఖాన్. ‘కేదార్‌నాథ్’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో యూత్‌ని మత్తులో పడేసింది. ఈ మూవీలో సుశాంత్ రాజ్‌పుత్‌కి జోడిగా నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కొన్ని బోల్డ్ సీన్స్‌లో అయితే వీరు జీవించినట్లే ఫీల్ అయ్యారు ఆడియన్స్.

ఇక వీళ్ల కెమిస్ట్రీ వెండితెరతో ఆగిపోలేదట. నిజజీవితంలో ఈ జంట డేటింగ్‌లో మునిగితేలుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అందుకు నిదర్శనమే ఇటివల జరిగిన సుశాంత్ బర్త్‌డే పార్టీ అంటోంది బాలీవుడ్. ఈ పార్టీ కోసం సారా డెహ్రాడూన్ నుంచి వచ్చింది. అంతేకాదు సుశాంత్ కోసం ప్రత్యేకంగా కేక్‌ను కూడా తీసుకొచ్చింది.

Also Read : సూర్యకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఫ్యాన్స్ ఫైర్

ఇక పార్టీ తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి కూడా వెళ్లినట్లు బాలీవుడ్ టాక్. దీంతో ఈ ఇద్దరిపై వదంతులు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సుశాంత్ గతంలో ఓ టీవీ నటితో ప్రేమాయణం సాగించాడు. హీరోయిన్ కృతీసనన్‌తో కలిసి డేటింగ్‌లంటూ షికార్లు చేశాడు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో కూతురితో ఎఫైర్ నడుపుతున్నాడంటూ.. సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుతోంది.

One thought on “ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ కూతురు!”

Comments are closed.