రోజూ రూ.121 పొదుపు చేయండి.. అమ్మాయి పెళ్లి రూ.27 లక్షలతో ఘనంగా చేయండి.. LIC బంపరాఫర్

పెళ్లి.. పెద్దింట్లో అయినా పేదింట్లో అయినా ఉన్నంతలో ఘనంగా చేయాలనుకుంటారు. అమ్మాయి అయితే అడిగినంత కట్నం ఇచ్చి ఆనందంగా అత్తారింటికి పంపించాలనుకుంటారు తల్లిదండ్రులు. మరి పెరుగుతున్న ఖర్చులు, దానికి తోడు ఆకాశాన్ని తాకుతున్న అబ్బాయిల కోరికలు వెరసి అమ్మాయి తండ్రికి పెళ్లంటే తడిసి మోపెడవుతుంది.

మరి ప్రేమగా పెంచుకున్న తన కూతురి పెళ్లి ఎలాంటి టెన్షన్ లేకుండా చేయాలంటే ఓ పాలసీ ఉందంటోంది ఎల్‌ఐసీ సంస్థ. దానిపేరు కన్యాధాన్ యోజన. ఈ పాలసీ పొందాలంటే మీకు 30 ఏళ్ల వయసుండాలి. మీ కూతురి వయసు ఏడాది ఉండాలి. 25 ఏళ్ల ఈ పాలసీకి ప్రీమియం 22 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. రోజుకు రూ.121లు పొదుపు చేస్తే నెలకు 3630 అవుతుంది.

ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సి ఉండదు. ఇక ఈ పాలసీ ఉన్నన్ని రోజులు అమ్మాయికి ఏడాదికి లక్ష రూపాయలు వస్తుంది. పాలసీ పూర్తయిన తరువాత నామినీకి రూ.27 లక్షలు వస్తాయి.