IL&FS దెబ్బ పడబోయే 6 మ్యూచువల్ ఫండ్స్ ఇవే.. ! పొరపాటున మీ దగ్గరున్నాయా??

2018 సంవత్సరంలో ILFS సంక్షోభం మార్కెట్లను తీవ్రంగా కలచివేసింది. రుణాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఆ కంపెనీని అథఃపాతాళానికి పడేసింది. ఈ కంపెనీ సంక్షోభం ఎఫెక్ట్ తో 6 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు తమ రేటింగ్స్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు IL&FSలో  పెట్టిన పెట్టుబడులు (స్పెషల్ పర్పస్ వెహికిల్స్) SPVలు తిరిగి వెనక్కి రాకపోవడంతో పలు రేటింగ్ ఎజెన్సీలు ఆయా MF కంపెనీల రేటింగ్స్ ను తగ్గించాయి. 

తాజాగా నిన్న మంగళవారం నాడు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా  6 మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల రేటింగ్స్ ను సవరించింది. వీటి రేటింగ్స్ ను అండర్ వాచ్‌ గా డౌన్‌గ్రేడ్ చేసింది. HDFC షార్ట్ టర్మ్ డెబిట్ ఫండ్HDFC బ్యాంకింగ్ అండ్ PSU డెబిట్ ఫండ్, UTI బ్యాంకింగ్ అండ్ PSU డెబిట్ ఫండ్ UTI బాండ్ ఫండ్, UTI డైనమిక్ బాండ్ ఫండ్ ,ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ షార్ట్ టెర్మ్ ఆపర్చ్యునిటీ ఫండ్  కంపెనీల రేటింగ్స్ ను  AA+ నుండి AA కు ఇక్రా తగ్గించింది. 

ILFS కంపెనీ SPV ల వల్ల డిఫాల్ట్ నష్టాలు పెరిగాయి. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఉత్తర్వుల ప్రకారం ILFS తన చెల్లింపులను నిలిపివేసిందని కంపెనీ కొత్త యాజమాన్యం మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు తెలియజేసింది. దీంతో MF కంపెనీలకు రావాల్సిన బకాయిలు రాకుండా పోయాయి. దీనిపై లీగల్ చర్యలకు కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సిద్ధమయ్యాయి. 2019 జనవరిలో  మరో రెండు MF కంపెనీలు అక్టోబర్ 15, 2018 తరువాత జారీ చేసిన రుణ చెల్లింపులను జరపాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై ఈ జనవరి 28న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLAT) మరో సారి హియరింగ్స్ కొనసాగించనుంది. 

ఇప్పటికే ILFS కంపెనీ నుండి బకాయిలు వసూలు కాక సతమతమౌతున్న MF కంపెనీలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ (JRPICL) కంపెనీ నుండి కూపన్ పేమెంట్స్ రావడం లేదని, ఈ జనవరి 21 వరకూ రావల్సిన బకాయిలు రాలేదని మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు పేర్కొన్నాయి. సంక్షోభంలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. స్వల్పకాలిక రుణాలను ఇవ్వడం , అవి వసూలు కాకపోవడంతో తమ రేటింగ్స్ ను కోల్పోవడం వాటికి పరిపాటిగా మారిందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నాయి.  
 

Recommended For You