టీ కొట్టులో పేలిన గ్యాస్ సిలిండర్.. మహిళా ఉద్యోగి మృతి

మహాబూబ్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మృతి చెందిన మహిళ మున్సిపల్ ఉద్యోగిగా గుర్తించారు. గాయపడిన ఐదుగురిలో నలుగురు మున్సిపల్ ఉద్యోగులే కాగ.. మరొకరు టీ కొట్టు యజమాని. సిలిండర్ పేలిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

మహాబూబ్ నగర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ టీ కొట్టులో రెండు సిలిండర్లు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది శుక్రవారం ఉదయం చెత్తను టీ కొట్టు డబ్బా దగ్గర వేసి నిప్పంటించారు. అదే సమయంలో కొట్టును తెరవగానే పేలుడు సంభవించింది. పరిసరాలన్ని చెల్లాచెదురైపోయాయి. పక్కనే ఉన్న షెడ్డులోని కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Also Read : హెడ్మాస్టర్‌కు పడకలు వేసే పీఈటీ.. టెన్త్ క్లాసు బాలికను గదికి పిలిపించుకుని..

టీ కొట్టు తెరిచే సమయానికే గ్యాస్ లీకై ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. డబ్బా పక్కనే మంట పెట్టడం..అదే సమయంలో కొట్టు తీయటంతో అప్పటికే లీకైన సిలిండర్ అంటుకున్నట్లు అంచనాకొస్తున్నారు.