కేసీఆర్‌ చేపట్టిన సహస్ర మహా చండీయాగం పరిసమాప్తం

_kcr-sahasra-chandi-yagam

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సహస్ర మహా చండీయాగం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఐదవ రోజైన ఇవాళ.. మొత్తం 9 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది. ఈ 8 మంటపాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభం అయింది.

Also Read : నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!

ఉదయం యధావిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు. అక్కడ ఋత్వికులు నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బగలాముఖి దేవి మంటపంలో జరిగిన పూజల్లో వేదపండితులు జయ పీతాంబర ధారణి, దివ్య వేదోక్త మహా నీరాజనం సమర్పయామి అంటూ పూజలు చేశారు.