ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

second phase election poling is over in telangana

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది… రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 10 వేల 668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడతలో మొత్తం 4వేల 137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3 వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Also read : ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది… ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు… ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు… మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.