కొత్త ఉద్యోగంలో చేరిన ఉపాసన.. కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

upasana-tweet-to-ktr-goes-viral-in-social-media-tells-about-her-new-job-kp

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆమె అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఉపాసన ఇన్ఫర్మేషన్ అందించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు ఇన్వెస్టర్లకు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఉపాసన వెల్లడించారు. కేటీఆర్ సర్ ‘‘నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అక్కడ పని చేసిన ఫొటోలను కొన్నింటిని షేర్ చేశారు. దానికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్.. ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

One thought on “కొత్త ఉద్యోగంలో చేరిన ఉపాసన.. కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్”

Comments are closed.