మిర్యాలగూడలో కలకలం సృష్టించిన బాలుడి మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ బాలుడి మృతి కలకలం సృష్టించింది. రాజీవ్ నగర్ కు రెండేళ్ల కార్తీక్ శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ లో శవమై తేలాడు. అయితే తమ కుమారున్ని ఎవ్వరో తీసుకెళ్లి, సెప్టిక్ ట్యాంక్ లో పడేసారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Also Read : శామ్ తీసుకున్న నిర్ణయంతో చైతూ షాక్..

శనివారం మిర్యాలగూడలోని అనుమానితుల ఇంటి ముందు బంధువులతో కలిసి కార్తీక్ పేరెంట్స్ ఆందోళన చేశారు. తమను అడ్డుకున్న పోలీసులతో పాటు స్థానికులతోను వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

One thought on “మిర్యాలగూడలో కలకలం సృష్టించిన బాలుడి మృతి”

Comments are closed.