ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించిన జపాన్..

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ టెన్నిస్ సెన్షేషన్ నయోమి ఒసాకా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆమె 7-6,5-7,6-4 స్కోర్‌తో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవాపై విజయం సాధించింది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి సెట్ నుంచే ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తసపడ్డారు.

Also Read : కివీస్‌కు ఘోర పరాజయం..ఆ ఒక్కడు మినహా..

టై బ్రేక్‌లో గెలిచిన ఒసాకా ఆధిక్యంలో నిలిచినా… తర్వాత రెండో సెట్ చేజార్చుకోవడంతో స్కోర్ సమమైంది. డిసైడింగ్ సెట్‌లో మాత్రం జపాన్ సంచలనానిదే పై చేయిగా నిలిచింది. ఒసాకా కెరీర్‌లో వరుసగా ఇది రెండో గ్రాండ్‌శ్లామ్‌. గత ఏడాది యుఎస్ ఓపెన్ గెలిచి సంచలనం సృష్టించిన ఈ జపాన్ ప్లేయర్‌ తాజా విజయంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కూడా సాధించింది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆమె నెంబర్ వన్ ర్యాంక్‌ అందుకోవడం హైలెట్‌గా చెప్పొచ్చు.

Recommended For You