గణతంత్ర వేడుకలకు ముస్తాబైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్

republic day celebrations in secunderabad parade grounds

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబయ్యింది. అత్యంత వైభవోపేతంగా వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జాతీయ భావాన్ని ప్రతిబింబించేలా అతిథులు కూర్చునే పందిళ్లను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో వేశారు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకలకు హాజరుకానున్నారు.

Also read : రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు

మూడు రోజుల ముందుగానే గ్రౌండ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు చేపట్టినట్లు హైదరబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌ పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితోపాటు అదనంగా పది ప్లాటూన్ల బలగాలను సైతం బందోబస్తుకు వినియోగిస్తున్నారు. సందర్శకులు, వీఐపీలకోసం ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు. వేడుకులకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు కార్ పాస్‌లు జారీ చేశారు.

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని త్రివిధ దళాలు కవాతులో పాల్గొంటాయి. గవర్నర్ ఆయా విభాగాలు అందించే కవాతు ప్రదర్శనను తిలకించి, వారి నుంచి గౌరవవందనం స్వీకరిస్తారు. త్రివిధ దళాలతో పాటు ఎన్.సీ.సీ, పోలీస్, ఎస్పీఎఫ్ పోలీసుల ప్రదర్శనలు ఉంటాయి. వివిధ శాఖల ప్రగతిని వివరించేందుకు శకటాల ప్రదర్శనతో పాటు ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్తమ పనితీరును కనబర్చిన పలువురు అధికారులకు అవార్డుల ప్రదానం ఉంటుంది.

వేడుకల్లో భాగంగా వివిధ శాఖలు రూపొందించిన ప్రగతి వాహనాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అటు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం జరగనుంది.

One thought on “గణతంత్ర వేడుకలకు ముస్తాబైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్”

Comments are closed.