కేసీఆర్,కేటీఆర్ లతో పవన్ మంతనాలు

at home in hyderabad rajbhavan

గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమం ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగినట్టు కనిపించింది. పలు ఆసక్తికర పరిణామాలకు కేంద్ర బిందువు అయింది. ఈతేనీటి విందులో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ముచ్చట్ల వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also read : ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

సీఎం కేసీఆర్‌ పక్కనే పవన్ కల్యాణ్ కూర్చున్నారు. మరోవైపు కేటీఆర్‌‌.. కూడా పవన్‌ పక్కనే ఉన్నారు. అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా వీరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో టీఆర్ఎస్.. వైసీపీ ఒక్కటయ్యాయని టీడీపీ విమర్శించింది. అటు పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్,కేటీఆర్ లతో పవన్ ముచ్చట్లపై రాజకీయల్లో చర్చనీయాంశం అయింది.

అటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తరువాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఎల్ రమణతో కేసీఆర్ సరదాగా సంభాషించారు. కేసీఆరే తనకు ప్రొటెక్షన్ అంటూ మీడియాతో గవర్నర్ నరసింహన్‌ చలోక్తులు విసిరారు.

గవర్నర్ నరసింహాన్ ఏర్పాటు చేసిన ఈ తేనిటీ విందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎంపీ కేశవరావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ నేత జానారెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు ఎట్ హోంలో పాల్గొన్నారు..

ఈకార్యక్రమానికి వచ్చిన వారందరికీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. గవర్నర్‌ నరసింహన్‌ ప్రతిఒక్కరిని ఆలింగనం చేసుకొని పలకరించారు. అటు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ అరగంట పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు.ఏది ఎమైన ఎట్ హోం కార్యక్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర రాజకీయ పరిణామాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు.