తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సుమారు..

huge rush in tirumala

వరుస సెలవులు కావటంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు బారులు తీరారు. 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో కాంపార్ట్ మెంట్ అవతల సుమారు కిలోమీటర్ మేర లైన్ ఉంది. సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.

Also read : వారికి కార్పొరేషన్లను ప్రకటించనున్న సీఎం చంద్రబాబు

ఇక కాలినడకన కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలొస్తున్నారు. నిన్న ఒక్కరోజే కాలినడకన 30 వేల మంది తిరుమలకు చేరుకోగా..ఈ రోజు ఇప్పటికే 32 వేల మంది కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. దీంతో దివ్యదర్శనం క్యూ లైన్లు కూడా భక్తులతో కిక్కిరిపోయాయి. 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్ వెలుపలికి వచ్చింది. దివ్యదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

వాతావరణం చల్లబడటంతో క్యూ లైన్లు భారీగా ఉన్నా భక్తులు ఓపిగ్గా నిలుచుంటున్నారు. మరోవైపు భక్తుల రద్దీ పెరగటంతో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం అన్నపానీయాలు అందజేస్తోంది టీటీడీ సిబ్బంది. మరోవైపు కళ్యాణకట్ట దగ్గర కూడా భక్తుల సంఖ్య పెరగటంతో సిబ్బంది సంఖ్యను పెంచారు. తిరుమలలో అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరగటంతో గదుల కొరత ఏర్పడింది.

Recommended For You