గాయంతో తప్పుకున్న కరోలినా.. ఇండోనేసియా టోర్నీ విజేతగా సైనా..

హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఆదివారం జరి గిన ఫైనల్ మ్యాచ్ లో 3 సార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత కరోలినా మారిన్ తో సైనా తలపడింది.

ఆట ప్రారంభం నుంచే స్పెయిన్ స్టార్ షట్లర్ చెలరేగిపోయింది. మ్యాచ్ మొదట్లోనే సైనా అనవసర తప్పిదం చేయడంతో తొలి పాయింట్ సాధించిన మారిన్, ఆ తర్వాత దూకుడు పెంచి 3-0 ఆధిక్యం సాధించింది. అనంతరం కాస్త పుంజుకున్న సైనా ఒక పాయింట్ సాధించడంతో స్కోరు 4-1గా మారింది. ఈ సమయంలో మారిన్ కాలుకు గాయమైంది.

Also Read :పెళ్లింట్లో విషాదం.. బాత్‌రూమ్‌లో నవ వధువు మృతి

కాలికి గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో మారిన్ ఇబ్బందిపడింది. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ రాకెట్ అందుకొని కోర్టులోకి అడుగుపెట్టింది. గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ లెక్క చేయకుండా సర్వ్ లు, ర్యాలీలతో చెలరేగిపోయి వరుస పాయింట్లు సాధించింది. తొలి గేమ్ లో 10-4 ఆధిక్యంలో ఉన్న సమయంలో గాయం తీవ్రత పెరిగిపోవడంతో మారిన్ ఆ బాధను భరించలేకపోయింది. దాంతో ఆమె రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.

కరోలినా మారిన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్‌ గెలవడంతో ఈ ఏడాది తొలి మాస్టర్స్‌ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో రన్నరప్ గా నిలిచిన సైనా, ఈ సారి మాత్రం టైటిల్ సాధించింది.

Recommended For You