కరెంట్ వైర్లపై నాగుపాము కలకలం

కరెంట్ వైర్లపై నాగుపాము కనిపించింది. నిజమా, కలా అనుకున్న జనం షాక్‌ తిన్నారు. పాము కరెంట్ వైర్లపై కదలడాన్ని గ్రామస్తులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

Also Read : పెళ్లింట్లో విషాదం.. బాత్‌రూమ్‌లో నవ వధువు మృతి

పైడిపర్రు గ్రామంలో కరెంట్ వైర్లపై పామును చూసి జనం షాక్‌ అయ్యారు. ఏ ఇంటిపై పడుతుందో, ఎవరిపై పడుతుందోనని ఆ గ్రామ ప్రజలు భీతిల్లిపోయారు. సుమారు గంట సేపు కరెంట్ వైర్లపై అటు ఇటు కదులుతూ ప్రజలను షాక్‌కు గురిచేసింది. గంట సేపు తర్వాత ఆ సర్పం మాయమైవటంతో అందరూ అమ్మయ్యా.. అంటూ గాలిపీల్చుకున్నారు.

Recommended For You