పెళ్లికి రండి.. మందు ఫ్రీ: వెడ్డింగ్ ఇన్విటేషన్

అరె భయ్.. జీవితంలో బ్యాచిలర్‌లైప్‌ ముగిసిపోతోంది. ఆ మధుర క్షణాల్ని స్నేహితులతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లవుతోంది. ఇద్దరికీ జాయింట్ స్నేహితులున్నారు. మరి వారందరితో ఆ సంతోష సమయాన్ని పంచుకోవాలనుకున్నారు తమిళనాడు కోయంబత్తూరులోని ఓ జంట. అందుకే తమ వివాహ ఆహ్వాన పత్రికను వినూత్న రీతిలో ముద్రించింది.

అతిధులను ఆహ్వానిస్తూ మా పెళ్లికి వస్తే క్వార్టర్ ఫ్రీ అని పెళ్లి పత్రికలో ముంద్రించారు. అంతేకాదండోయ్.. అవివాహితులకైతే రెండు క్వార్టర్లు అందజేస్తాం అంటూ ఆహ్వానం పలికారు. మంచి రుచికరమైన భోజనంతో పాటు మందు ఫ్రీ అనేసరికి ఆహా.. మా క్కూడా పెళ్లికి ఆహ్వానం వస్తే ఎంత బావుండు అని అనుకుంటున్నారు వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసిన మందు బాబులు.

Recommended For You