బిగ్ బాస్ సీజన్ 3 చేయాలంటే ఎన్టీఆర్ కి కండిషన్స్ పెడుతున్న..

బిగ్ బాస్ సీజన్ 3 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్, సెకండ్ సీజన్ లో నాని హోస్ట్ లుగా చేశారు. మరి ఈ థర్డ్ సీజన్లో ఎవరు హోస్ట్ గా ఉంటున్నారో తెలుసా..? ఇంకెవరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ సీజన్ 1లో తారక్ తన వాక్ చాతుర్యంతో బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. సీజన్ 1 విజయం సాధించటానికి ఎన్టీఆర్ కూడా ఓ కారణమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు సీజన్ 3లో హోస్ట్‌గా తారక్ చేస్తున్నాడంటూ సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికోసం భారీ రెమ్యూనిరేషన్ నే తారక్ కు ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్.

Also Read : క్రిష్‌, కంగనా గొడవకు అసలు కారణం ఏంటో తెలిస్తే..

బిగ్ బాస్ షో చేయాలంటే, ఎన్టీఆర్ కి.. మరో బిగ్ బాస్.. కండిషన్స్ పెడుతున్నాడట. ఎన్టీఆర్ కి కండిషన్స్ పెడుతున్న బిగ్ బాస్ ఎవరా అనుకుంటున్నారా…? ఆయన ఎవరో కాదు జక్కన్న. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమోళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. తారక్, చెర్రీ ఇందులో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూళ్ల గ్యాప్ లో తారక్ బిగ్ బాస్ షో చేసే ఆలోచనలు సాగుతున్నాయట. అయితే తన షూటింగ్ లో ఉండగా ఆయన హీరోలు మరో వాటిపైన ఫోకస్ చేయడం జక్కన్నకు ఇష్టం ఉండదు. మరి తారక్.. రాజమౌళికి ఏం చెప్పి బిగ్ బాస్ చేస్తాడు అంటూ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Recommended For You