ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రయినింగ్‌లో నెలకు రూ.56,100.. శిక్షణానంతరం 1,77,500

ఇండియన్ ఆర్మీ (ఐఏ) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (టెక్నికల్)
మొత్తం ఖాళీలు: 191 (పురుషులు – 175, మహిళలు – 24)
బ్రాంచీల వారీగా ఖాళీలు:

సివిల్ 50, మెకానికల్ 17, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 24, ఏరోనాటికల్ / బాలిస్టిక్స్ / ఏవియానిక్స్ 12, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్శర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ 47, ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ 25, ఎలక్ట్రానిక్స్ / ఆప్టో ఎలక్ట్రానిక్స్ / ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ 8 , ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 3, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ 3 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు అక్టోబర్ 1 లోపు ఉత్తీర్ణులు కావాలి.
వయసు: 2019 అక్టోబర్ 7 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. (1992 అక్టోబర్ 2 నుంచి 1999 అక్టోబర్ 1 మధ్య జన్మించి ఉండాలి)
నిర్దేశిత శారీరక ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
విడోస్ ఆఫ్ డిఫెన్స్ అభ్యర్థులకు మాత్రమే
ఎస్ఎస్‌సీ (ఉమెన్) 2 ఖాళీలు (నాన్ టెక్నికల్ 1, టెక్నికల్ 1)
అర్హత: నాన్ టెక్నికల్‌కు ఏదైరా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్‌కు ఏదైనా బ్రాంచీలో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత
వయసు: 2019 అక్టోబర్ 7 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెప్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100 – 1,77,500/- జీతం చెల్లిస్తారు.
వీటితో పాటు అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
శిక్షణ: ఆఫీసర్ ట్రయినింగ్ అకాడమీ చెన్నైలో 2019 అక్టోబర్ నుంచి 49 వారాల శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు.
ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ), ఇంటర్వ్యూ / టెస్ట్ ద్వారా
ఎస్ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ/ టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
ఇంర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ / టెస్ట్‌లను వరుసగా ఐదు రోజుల పాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్) లో నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 21
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in