మీ జీతంలో పన్ను మినహాయింపు ఎలా జరుగుతుందంటే..

TDS లేదా పన్ను మినహాయింపు అనేది పన్ను చట్టం సెక్షన్ 192 కింద తప్పనిసరి. అయితే ఈ మొత్తం పన్ను చెల్లింపుదారుల జీతం నుండి లెక్కిస్తారు. TDS మినహాయింపు తర్వాత మిగతా మొత్తాన్ని ఉద్యోగికి చెల్లిస్తారు. ఇంతకీ పన్ను మినహాయింపు ఎలా జరుగుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. TDS లెక్కింపు ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుడి సగటు ఆదాయం పన్ను రేటు ఆధారంగా తీసివేయబడుతుంది. సగటు ఆదాయం పన్ను రేటు లెక్కింపునకు, నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం కోసం అమలులో ఉన్న పన్ను రేటు పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదాహరణకు 60 సంవత్సరాలున్న వ్యక్తి సంవత్సరానికి రూ.8.4 లక్షల ఆదాయం వస్తుందనుకుంటే.. ఆదాయం పన్ను స్లాబ్ రేటు ప్రకారం (AY 2019-20) 20% స్లాబ్ రేటులో చేర్చబడుతుంది. అతను ఆరోగ్యం, విద్య మరియు సెస్‌లపై FY 2018-19 కు రూ.1 లక్ష మినహాయింపు కోరడం జరిగింది. ఇప్పుడు అతని జీతం మీద చెల్లించవలసిన పన్ను మొత్తం 4% ఆదాయం పన్నుగా పరిగణించబడుతుంది. 20% (7,40,000-5,00,000) + 5% (5,00,000 – 2,50,000) + (4% ఆదాయం పన్ను) = 48,000 + 12,500 + (60% 60,500) = రూ. 62,920.
జీతం ఆదాయంలో లెక్కింపు ఎలా ఉంటుందంటే.. సగటు పన్ను రేటు= చెల్లించవలసిన మొత్తం పన్ను / మొత్తం వేతనం * 100 అందువలన పైన చెప్పిన ప్రకారం టిడిఎస్ 7.49 శాతంగా లెక్కించబడుతుంది. కాబట్టి, మిస్టర్ భరత్‌కు, 7.49% తో ఏడాదికి రూ.70,000 TDS ను తీసివేయబడుతుంది. మరియు జీతం నుండి నెలకు రూ.5243.33 రూపాయలు TDS గా తీసివేయబడుతుంది. ప్రతి ఆర్ధిక సంవత్సరానికి, TDS పన్ను రేటు, చెల్లింపుదారుల ఆదాయం ప్రకారం అలాగే స్లాబ్ రేటు ప్రకారం అతను లేదా ఆమె ఆర్థిక సంవత్సరంలో సూచించిన రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.