స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో కొలువుల జాతర..

పదోతరగతి నుంచి డిగ్రీ చదుకున్న వారి కోసం ఏటా లక్షలాది కొలువుల భర్తీ ప్రక్రియను చేపట్టే సంస్ధ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ). యూపీఎస్సీ తర్వాత ఏటా క్యాలెండర్ ప్రకటించి కేంద్రంలో ఆయా శాఖల్లో ఆడిటర్ ఆఫీసర్ల నుంచి మల్టీటాస్కింగ్ వరకు పోస్టుల భర్తీని ఎస్ఎస్‌సీ చేపడుతుంది. 2019లో భర్తీ చేయబోయే కొలువులు, పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో వివరాలు క్లుప్తంగా..
భర్తీ చేయనున్న పోస్టులు:
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్, సెంట్రల్ ఎక్సైజ్, సీబీడీటీ), ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజనీర్, ట్రాన్స్‌లేటర్లు తదితర పోస్టులు ఉన్నాయి.
ఎన్ని కొలువులు..
ఏటా లక్షలావి కొలువుల భర్తీని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ భర్తీ చేస్తుంది. ఇందులో ప్రధానంగా సీజీఎల్ ద్వారా సుమారు 20 వేలకు పైగా డిగ్రీ స్థాయి అర్హత అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పిస్తుంది. దేశంలో అత్యంత క్రేజీ ఉన్న పరీక్షల్లో ఇది ఒకటి. సుమారు 50 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్ అర్హతతో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామ్.. ఈ పరీక్షకు సైతం లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. ఆ తరువాత ఉన్న పరీక్షలు జూనియర్ ఇంజనీర్లు, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలు.