బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ‘స్పైడర్ మ్యాన్’

స్పైడర్ మ్యాన్‌ని సినిమాల్లో మాత్రమే చూస్తాం. పెద్ద పెద్ద భవనాలు ఎక్కేసి ఫైటింగ్ చేసేసి పిల్లలతో పాటు పెద్దల్ని కూడా మంచి ఎంటర్‌టైన్ చేస్తాడు. పిల్లల కోసం స్పైడర్ మ్యాన్ గేమ్‌షోలు కూడా వచ్చేసాయి.

అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగికి స్పైడర్ మ్యాన్‌లా డ్రస్ వేసుకోవాలనిపించింది. చిన్న పిల్లలు ఆ డ్రస్‌ వేసుకుని ముచ్చట పడడం మనం చూస్తుంటాం. అలాగే ఆయన కూడా ఆ డ్రస్ వేసుకుని ఆఫీసుకి వచ్చి యధావిధిగా విధులు నిర్వర్తించారు.

ఇక స్టాఫ్ అందరి కళ్లూ ఆయనపైన్. నిజంగానే మనమధ్యకు స్పైడర్ మ్యాన్ వచ్చాడేమో అన్నంతగా ఫీలయ్యారు. ఇంతకీ మీకెందుకు ఈ డ్రస్ వేసుకోవాలనిపించింది అని అంటే ఈరోజు నా రిటైర్మెంట్ రోజు. అందరికీ గుర్తుండిపోయే సర్‌ఫ్రైజ్ ఇవ్వాలనిపించింది.

అందుకే ఇలా డ్రస్ చేసుకుని వచ్చాను అని చెప్పారు. స్పైడర్ మ్యాన్ అదేనండి తమ తోటి ఉద్యోగి విధులు నిర్వహిస్తుండగా సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఫొటోలకు 1.2 లక్షల వ్యూస్ రాగా, వీడియోకు 2.4 లక్షల వ్యూస్ వచ్చాయి.

Recommended For You