అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగడం అదృష్టం : సీఎం చంద్రబాబు

cm chandrababu inaugurate lord venkateswara temple in amaravati

దేవతల రాజధానిగా పేరున్న అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం జరగడం అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీటీడీ నేతృత్వంలో నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భూమి పూజలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేయనున్నట్టు సీఎం తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రం ఎన్ని పోగొట్టుకున్నా.. వెంకటేశ్వరస్వామి మనచెంతే ఉన్నాడన్న ధైర్యంతో ముందుకుసాగుతున్నామన్నారు. తనకు ప్రాణబిక్ష పెట్టిన వెంకటేశ్వర స్వామి రాష్ట్రాన్ని కూడా కాపాడతారన్నారు చంద్రబాబు. ఆలయ నిర్మాణం కోసం రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం 25 ఎకరాలను ఉచితంగా భూమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అమరావతి నిర్మాణంలో శ్రీవారి ఆలయం కూడా ఆధునిక వైకుంఠంగా వెలుగొదండంతో పాటు.. మైలురాయిగా నిర్మాణం నిలుస్తుందన్నారు.

Recommended For You