చందా కొచ్చర్ కు ఇంక్రిమెంట్లు, బోన‌స్‌లు రద్దు చేసిన బ్యాంక్

icici-banks-former-ceo-chanda-kochar-has-been-convicted

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్, బ్యాంక్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఐసీఐసీఐ ఎంక్వైరీ క‌మిటీ తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందువల్లే ఆమెను తొలగించామని ప్రకటించింది. వీడియో కాన్ కంపెనీకి అక్ర‌మ ప‌ద్ధ‌తిలో రుణాలు ఇచ్చిన కేసులో చందా కొచ్చార్‌పై విచార‌ణ చేప‌ట్టామని, దర్యాప్తులో నిజాలు బయటపడడంతో కొచ్చర్‌ను తొల‌గించామ‌ని క‌మిటీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆమెకు కల్పించే ఇంక్రిమెంట్లు, బోన‌స్‌లు, వైద్య స‌దుపాయాల‌న్నింటినీ ర‌ద్దు చేస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2018 వ‌ర‌కు తీసుకున్న బోన‌స్‌ల‌ను ఆమె తిరిగి చెల్లించాలని కూడా బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

Recommended For You