దుర్వాసన వచ్చే పండు ఖరీదు రూ.70వేలు

మురికి కాలువ, చెపట పట్టిన సాక్స్ వాసన వచ్చే పండు గురించి ఎప్పుడైన విన్నారా.. ఎక్కడైనా చదివారా.. భూమి మీదా ఇలాంటి పండు కూడా ఉంది. మరీ ఈ పండు ఖరీదు ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఈ పండు ఖరీదు రూ.70వేలు. అవును మీరు చదువుతున్నది నిజం. ఈ పండు కాస్టు అక్షరాల రూ.71వేల141 ( 1000 డాలర్లు).

ఈ పండులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నరా.. ఇది అత్యంత అరుదుగా దొరికే పండు. ఆగ్నేసియాలో దొరికే ఈ పండు పేరు డురియన్. జే -క్వీన్ హైబ్రిడ్ రకానికి చెందిన ఈ పండును ఇండొనేసియన్లు పండులో రారాజుగా భావిస్తారు. ఇవి గుండ్రటి ఆకారంలో ఉంటూ.. అరుదుగా లభిచటం వల్లనే వీటికి అంత ధర ఉంటుంది.

Also Read : బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ‘స్పైడర్ మ్యాన్’

ఈ పండ్లు నుంచి వచ్చే దుర్వాసన కారణంగా సింగపూర్‌లోని కొన్ని హోటల్స్‌లో వీటిని నిషేధించారు. కానీ ఇండొనేసియాలో ఈ పండ్లు 1000 డాలర్లకు అమ్ముడవ్వటంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.

Recommended For You