పెళ్లిని ఎవరు కనిపెట్టారో కానీ… హీరోయిన్‌పై..

బాలీవుడ్ నటీ,మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వివాహ బంధంపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్మిత గత కొంతకాలంగా ప్రముఖ మోడల్ రోమన్ షాల్‌తో ప్రేమలో ఉన్నారు. మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని సన్నిహితులు పదేపదే సుస్మితను విసిగిస్తుండడంతో ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ” నరకం లాంటి పెళ్లిళ్లను ఎవడు కనిపెట్టాడో..! నీపై నా ప్రేమ ఎంతలా ఉందంటే.. నన్ను నువ్వు ఎప్పుడు వదిలివెళ్ళకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చేస్తాను”. అంటూ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రోమన్‌పై తనకు ఉన్నప్రేమను పరోక్షంగా వ్వక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హట్ టాఫిక్‌గా మారింది. సుస్మితకు ఏమాత్రం వివాహ బంధంపై అవగాహన లేదు జనాల్లో తను తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అన్నది నీ స్వంత అభిప్రాయం..ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇన్‌వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్‌కు సుస్మిత కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ” క్లాస్‌లో టీచర్‌ వేసిన ప్రశ్నకు నాకు వచ్చిన సందేహన్ని అడిగాను. దీంతో నేను అడిగినదాన్ని క్లారిఫై చేయకుండా నన్ను క్లాస్‌లో నుంచి టీచర్ బయటికి పంపించేసినట్లే నెటిజన్ల వ్యవహారం ఉందంటూ” ధీటుగానే బదులిచ్చారు

View this post on Instagram

???????? #marriage #strategy #cushandwizdom ????❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on