తీవ్రమైన చలి.. 21 మంది మృతి

అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Also Read : భారీ అగ్నిప్రమాదం.. ఉపాధి కోల్పోయిన వందలాదిమంది..

మంచుతోపాటు అర్కిటెక్ నుంచి చలిగాలులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. రోడ్లపక్కనుండే నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారడంతో వారికి ప్రత్యేకంగా వార్మింగ్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రజలను ఇళ్లనుంచి వెచ్చటి కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మొత్తం 12 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయని, మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.