ఎస్బీఐ ఎటిఎం కార్డు ఉన్న ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు..

దేశంలోనే అత్యధిక ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల కార్డులను అందిస్తోంది. నగదు ఉపసంహరణ పరిమితి విషయంలో కూడా ఎస్‌బీఐ పలు రకాల కార్డులను వినియోగదారులకు అందిస్తోంది. ఎస్‌బీఐ ఎటిఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలు..

ఎటిఎం తీసుకోగానే ముందుగా దాని వెనకవైపు సంతకం చేయాలి.
మీ ఎటిఎం పిన్ నెంబర్ అప్పుడప్పుడు మారుస్తుండాలి.
ఎటిఎం మీద ఎప్పుడు మీ పెన్ నెంబర్ రాయకూడదు.
ఎవరైనా మీకు కాల్ చేసి మీ కార్డు పిన్ నెంబర్ అడిగితే చెప్పకూడదు.
మీరు ఎటిఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు లోపలికి ఎవరినీ రానివ్వకూడదు.
పిఓఎస్ మెషిన్ మీరు వాడేటప్పుడు మీ పిన్ నెంబర్ ఎవరికీ కనబడకుండా చూసుకోవాలి.
మీరు ఎటిఎంలో డబ్బు విత్ డ్రా చేసుకున్నాక స్లిప్ వస్తుంది అయితే అది అక్కడ పడేయకూడదు. ఎందుకంటే దాంట్లో మీ అకౌంట్‌కి సంబంధించిన వివరాలు ఉంటాయి.
ఎటిఎంలో గ్రీన్ కలర్ లైట్ వచ్చేవరకు మీరు మిషన్‌లో కార్డు పెట్టకూడదు.
ఎక్కడికెళ్లినా కార్డు స్వైప్ చేస్తుంటారు. హోటల్స్‌కి, షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు మీ ముందరే కార్డ్ స్వైప్ చేసేలా చూసుకోండి.
తాత్కాలిక స్టాల్స్‌లో కార్డ్ స్వైప్ చేయకపోవడమే మంచిది.
లావాదేవీలు చేసిన ప్రతి సారి మీ మొబై‌ల్‌కి ఎస్ఎంఎస్ వచ్చేలా చూసుకోండి. అందుకోసం మీ బ్యాంకులో మొబైల్ నెంబర్ ఇవ్వండి.
ఒకవేళ ఎటిఎం కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకున్నట్లైతే వెంటనే 1800 425 3800 లేదా 1800 11 22 11 ఫోన్ చేసి మీ కార్డును బ్లాక్ చేయించుకోండి.

Recommended For You