భారీ అగ్నిప్రమాదం.. ఉపాధి కోల్పోయిన వందలాదిమంది..

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూజెర్సీలోని మార్సెల్ పేపర్ మిల్లులో మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరు మరణించలేదని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read : అమెరికాలో స్టూడెంట్స్‌ గురించి ఆందోళన అవసరం లేదు – అధికారులు

ఒకవైపు తీవ్రమైనమంచు, మరోవైపు ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటలు అదుపుచేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. పది అగ్నిమాపక వాహనాలతో అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ శిథిలాలను న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫే పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వందలాదిమంది ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకుంటామన్నారు.

Recommended For You