ఉద్యోగం చేస్తున్నదంపతులిద్దరికీ ఉమ్మడి జీవిత బీమా పాలసీ..

పెరుగుతున్న ఖర్చులు.. ఒకప్పుడు ఆడంబరం అనిపించే ప్రస్తుత అవసరాలు.. వెరసి భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరం ఇద్దరికీ సమానంగా ఉంటోంది. పని చేసే దంపతులిద్దరూ ఒకే పాలసీ తీసుకుంటే వారి భవిష్యత్తుకి తగిన భరోసా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మనదేశంలో ఇలాంటి పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి.

సాధారణంగా భారత్‌లో దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ భర్తలు తమ పేరు మీద జీవిత బీమా పాలసీలు తీసుకొని భార్యను నామినీగా ఉంచుతారు. ఇలాంటి పాలసీల వల్ల కుటుంబంలో ఒక్కరికే బీమా రక్షణ ఉంటుంది. ఇద్దరి పేరు మీద కలిపి ఒకే పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉమ్మడి జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

వాటిలో మనీ బ్యాక్ లేదా ఎండోమెంట్ తరహా పాలసీలు అందుబాటులో ఉంది. ఉమ్మడి పాలసీని అందించే సంస్థలు, పాలసీని బట్టి ప్రీమియం, పాలసీ మొత్తం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీని ఎంపిక చేసుకోవాలి.

Recommended For You