ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు..

గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ వెస్ట్రర్న్ సెక్టార్)లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్, సెక్యూరిటీ సూపర్ వైజర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఫార్మసిస్టు, జూనియర్ సెక్యూరిటీ, జూనియర్ ఫైర్ సూపర్ వైజర తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఆధారంగా విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులను దరఖాస్తు ఫీజుగా రూ.370 చెల్లించి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులు, నైపుణ్య పరీక్షల ద్వారా ఉద్యోగాకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 737
పోస్టులు ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్ (గ్రేడ్ 3) 19
అసిస్టెంట్ టెక్నీషియన్ 265
అసిస్టెంట్ రిగ్ మ్యాన్ (డ్రిల్లింగ్) 02
అసిస్టెంట్ (గ్రేడ్ 3) 04
సెక్యూరిటీ సూపర్ వైజర్ 11
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 12
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ 254
జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్ 31
జూనియర్ సింగ్లర్ కమ్ రిగ్గర్ 04
ఫార్మసిస్ట్ 17
నర్స్ (గ్రేడ్ 4) 01
జూనియర్ అసిస్టెంట్ 76
జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్ 20
జూనియర్ ఫైర్ సూపర్ వైజర్ 13
జూనియర్ ఫైర్‌మ్యాన్ 05
జూనియర్ హెల్త్ అటెండెంట్ 03
అర్హత: పోస్టుల ఆధారంగా విద్యార్హతలను నిర్ణయించారు. దీని ప్రకారం పదో తరగతి, ఇంటర్, సంబంధిత విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.370 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్/ స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షవిధానం: మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగటివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2019
చివరి తేదీ: 20.02.2019
సీబీటీ( ఆన్‌లైన్ పరీక్ష)తేదీ: మార్చి చివరి వారంలో

Recommended For You