ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధన.. – ట్రంప్ ప్రభుత్వం

h1b visa

అమెరికాలో H-1-B వీసా ఫైలింగ్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధనను అమలులోకి తీసుకువస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు H-1-B క్యాప్ రిజిస్ట్రేషన్ నిబంధనను అ మెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలును మాత్రం డీహెచ్‌ఎస్ వాయిదా వేసింది.

Also Read : జయరాం హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఆమె!

తాజా నిబంధన ప్రకారం తొలుత అమెరికా వర్సిటీల నుంచి పీజీ పట్టా లేదా అంతకంటె ఎక్కువ చదివినవారికి రెగ్యులర్ లాటరీ నిర్వహిస్తారు. ఫలితంగా H-1-B వీసాలను దక్కించుకునే అవకాశం వారికే ఎక్కువ గా ఉంటుంది. అమెరికాలో అడ్వాన్స్‌డ్ డిగ్రీ లు పొందని భారతీయ అభ్యర్థులు H-1-B వీసాలను పొందడం కష్టమవుతుంది. అమెరికాలో ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటికి అదనంగా మరో 20 వేల వీసాలను అమెరికన్ కాలేజీల్లో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పొందిన వారికి కేటాయిస్తున్నారు. దీనినే మాస్టర్స్ క్యాప్ అంటారు. ప్రస్తుతం మాస్టర్స్ క్యాప్ లాటరీని తొలుత నిర్వహిస్తున్నారు. ఈ లాటరీలో ఎంపిక కాలేనివారిని రెగ్యులర్ క్యాప్‌లో చేర్చి ర్యాండమ్ సెలెక్షన్ నిర్వహిస్తారు.

Recommended For You