ఇవి ఏంటో తెలిస్తే షాక్ అవాల్సిందే

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇదో ఉదాహరణ. ఈ వీడియోలో చూడడానికి నల్లని వెంట్రుకల్లా కనిపిస్తాయి.కానీ వాటిని కదుపుతే కానీ అసలు విషయం తెలియదు. ఇంతకి ఆ వీడియో ఏముందని అలోచిస్తున్నారా? వీడియోలో కనిపించేవి మెక్సికో దేశంలోని స్కాంట్‌లాండ్‌లలో ఉండే స్టర్ ఆఫ్ డాడీ లాంగ్ లెగ్స్ జీవులు. వీటి అర్థం పొడవైన కాళ్లు కలిగిన సాలీళ్ల జీవి.

నల్లగా కనిపించే ఈ జీవులు ఒకే చోట గుంపులు గుంపులుగా నివసిస్తాయి. సాలీళ్ళు అన్నీ ఒక దగ్గరకు చేరి తల భాగం లోపలికి పేట్టి ఒకదాని ఒక్కటి అతుక్కొని ఉంటాయి. దీంతో అవి తల వెంట్రుకల్లా కనిపిస్తాయి. వాటిని కదిపితేగాని అవి సాలిళ్ళని గుర్తించలేం. సాధరణ సాలిళ్ళకు మూడు నుంచి నాలుగు జతల కాళ్ళు ఉంటాయి.వీటికి ఒక జత కాళ్ళు మాత్రం ఉంటాయి.

శత్రువుల రక్షించుకోవడానికి,వెచ్చదనం కోసం ఈ సాలిళ్లన్నీ ఇలా గుంపుగా ఒకే చోటకు చేరతాయి. ఈ సాలీళ్లు విషపూరితమైనవి కావు. ఇవి చాలా ప్రాచీనమైనవిగా జంతు శాస్త్రజ్ఞులు తెలిపారు. సుమారు 400 మిలియన్ ఏళ్ల నుంచి ఈ సాలీళ్లు ఉనికిలో ఉన్నాయట. వీటికి సిల్క్ గ్లాండ్స్ లేకపోవడంతో మిగితా సాలీళ్ళల గూళ్ళను నిర్మించలేవు. ఇవి తెమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు నివసిస్తాయని పరిశోధకులు తెలిపారు.

Recommended For You