అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి హిందూమహిళగా గర్వపడుతున్నా.. – తులసీ గబార్డ్

Tulsi Gabbard

తన మతాన్ని కారణంగా చూపించి తనను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భారతీయ అమెరికన్, కాంగ్రెస్ ఉమెన్ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ మతాని కిచెందిన వ్యక్తిని కావడం వల్లే కొందరు, తనను తన మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగడం సరైంది కాదని ఆమె అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పటి పోటోలను చూపిస్తూ విమర్శించడం సరైంది కాదన్నారు.

Also Read : తీవ్రమైన చలి.. 21 మంది మృతి

అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోపాటు మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, మాజీ విదేశాంగమంత్రి హిల్లరీక్లింటన్లు కూడా మోడీని కలిశారని ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి హిందువుగా, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి హిందూ మహిళగా గర్వపడుతున్నానని ఆమె అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను బయపడేది లేదని తులసీ గబ్బార్డ్ స్పష్టంచేశారు.

Recommended For You