సోమవారానికల్లా అమెరికాలోని మన విద్యార్థులతో మాట్లాడతాం – భారత రాయబార కార్యాలయం

will have access to all students by monday in university of farminton issue

అమెరికా ప్రభుత్వ ఉచ్చులో చిక్కుకున్న మన విద్యార్థులను విడిపించడానికి భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. విద్యార్థుల వెనుక భారత ప్రభుత్వం ఉందని మర్చిపోవద్దని ఇప్పటికే అమెరికాకు చెప్పింది. తీవ్రమైన అభ్యంతర పత్రాన్ని కూడా జారీ చేసింది. భద్రతా అధికారుల నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరితోనూ సోమవారానికల్లా మాట్లాడే ప్రయత్నం చేస్తామంది ఇండియన్ ఎంబసీ. అమెరికాలో మన దౌత్యవేత్త హర్షవర్దన్ శ్రింఘాల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మిచిగాన్ లో.. యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్ టన్ పేరుతో ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించి అమెరికా ప్రభుత్వం వల పన్నింది.

Also read : తెలంగాణ మంత్రి వ‌ర్గం విస్తర‌ణ‌కు సీఎం కేసీఆర్ సిద్ధం.. ఈనెల..

ఇందులో మన విద్యార్థులు చిక్కుకున్నారు. డిటెన్షన్ లో ఉన్న విద్యార్థులను వీలైనంత త్వరగా కలుసుకుంటామన్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అవసరమైతే లాయర్ల ప్యానల్ తో మాట్లాడవచ్చన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాట్ లైన్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. దాదాపు వంద కాల్స్ వచ్చినట్టు చెప్పారు హర్షవర్దన్ శ్రింఘాల. విదేశాంగ శాఖ కార్యదర్శి సూచనల మేరకు.. ఈ వ్యవహారాన్ని పూర్తిగా డీల్ చేయడం కోసం ఓ నోడల్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థుల నిర్బంధం విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు.

Recommended For You