చేతులు, కాళ్లు చెట్టు బెరడులా.. ఎన్నాళ్లిలా: ఓ యువకుడి ఆవేదన

భగవంతుడా.. పగవాడిక్కూడా రాకూడదు ఇలాంటి జబ్బు. ఆ అబ్బాయిని కన్న తల్లిదండ్రులు ఇలానే ఆవేదన చెందుతున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన 28 ఏళ్ల అబుల్ బజందర్ హ్యూమన్ పపిల్లోమా వైరస్ (HPV) అనే వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ వ్యాధి సోకి చర్మం మొత్తం చెట్టు బెరడులా మారిపోతూ తరచూ ఆస్పత్రి పాలవుతున్నాడు. ఇప్పటికి 25 సార్లు ఆపరేష్ చేయించుకున్నాడు. అయినా ఆగట్లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణించడం కారణంగానే పులిపిర్లు అనే ఈ వ్యాధి వస్తోందని వైద్యులు నిర్ధారించారు.

అయితే ఇది మళ్లీ పునారావృతం కాకుండా సమూలంగా నాశనం చేయలేకపోతున్నారు. దాంతో అతడి బాధ వర్ణనాతీతంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుట్టుక నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న అబుల్‌కు 2016లో డాకా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స చేసి వాటిని తొలగించారు.

అయినా వ్యాధి తగ్గకపోగా తీవ్రతరమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న అతడిని పరీక్షించడం కోసం తొమ్మిది మంది వైద్యులతో కూడిన బృందం మళ్లీ శస్త్ర చికిత్స చేయడం కోసం సమాయత్తమవుతోంది.

Recommended For You