రియల్‌మి సేల్.. బ్రహ్మాండమైన ఆఫర్లు..

ఒప్పోకు చెందిన సబ్ బ్రాండ్ రియల్‌మి ‘యు అండ్ రియల్‌మి డేస్’ సేల్‌ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా మొబిక్విక్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన వారికి 15 శాతం క్యాష్ బ్యాక్‌ని అందిస్తోంది. అలాగే ప్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్ మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో రియల్‌మి ఫోన్ల కొనుగోలుపై డిస్కౌంట్‌లు, గిప్ట్‌లను ఇవ్వనున్నారు. రియల్ మి యూ 1 ఫోన్ కొనేవారికి ఇయర్ ఫోన్స్‌ని ఉచితంగా ఇస్తారు.

ఇక రియల్‌మి సి1 కొనేవారికి రూ.500 విలువైన మూవీ వోచర్లను అందిస్తారు. రియల్‌మి 2 ప్రొ ఫోన్ కొనుగోలుపై రూ.500 విలువైన గూగుల్ ప్లే వోచర్లను ఇస్తారు. ఇక సేల్‌లో చివరి రోజైప ఫిబ్రవరి 7న రియల్‌మి టెక్ బ్యాక్‌ప్యాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రియల్ మి ఇయర్ ఫోన్స్‌ని ఉచితంగా ఇస్తారు. వీటితో పాటు రియల్ మి మోడల్స్‌పై డిస్కౌంట్లను వినియోగదారులకు అందించనున్నారు.

Recommended For You