అమెరికాపై భారత్ సీరియస్‌.. విద్యార్థులను ట్రాప్ చేసేందుకు రూ.2 కోట్లు..

అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో జాబ్స్ చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

అమెరికాపై భారత్ సీరియస్‌గా ఉంది. ఢిల్లీలోని అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ నిరసన తెలిపింది. ఫార్మింగ్టన్ యూనివర్సిటీ మూసివేత, భారత విద్యార్థుల అరెస్టుపై భారత్ నిరసన తెలిపింది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది. ప్రభుత్వమే అడ్డదోవన వెళ్లడం ఏమిటని అమెరికన్ లాయర్లు ప్రశ్నిస్తున్నారు. తమ విద్యార్థులను మీరు ఎలా మోసం చేస్తారని భారత్ ప్రశ్నిస్తోంది. బాధిత విద్యార్థుల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నాయి.

Also Read : శిఖా చౌదరితో డేటింగ్.. జయరాంని చంపింది తానేనని అంగీకరించిన..

మరోవైపు, తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు తెలుగు సంఘాలు ముందుకు వచ్చాయి. తెలుగు విద్యార్థులను ట్రాప్ చేసేందుకు సదరు ఫేక్ యూనివర్సిటీ తెలుగు దళారులకు రూ.2 కోట్లు చెల్లించిందట. అరెస్టైన భారతీయ విద్యార్థులకు సహకారం అందించేందుకు అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యాలయం 24 గంటలు పనిచేసే హాట్‌లైన్‌ను తెరిచింది. అమెరికాలోనే ఉండాలనే ఉద్దేశంతో నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటివరకు 130 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 129 మంది భారత్‌కు చెందినవారేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

మరోవైపు నకిలీ యూనివర్సిటీ కేసులో అగ్రరాజ్యమైన అమెరికాలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు పోలీసుల నిర్భందంలో ఉండడంతో వారి కుటుంసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. న్యూజెర్సీ డిటెన్షన్ సెంటర్‌లో స్టూడెంట్స్‌ని విద్యార్థులను తెలుగు సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. తెలుగు రాష్ట్రాలు ఇందులో జోక్యం చేసుకుంటే సమస్య కొంత తీరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థులు బయటకు రావాలంటే సుమారు 30 నుండి 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం. 5వేల డాలర్ల పూచీకత్తు.. పౌరసత్వం ఉన్నవారు హామీనిస్తే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి కంగారు పడొద్దని..విద్యార్థులంతా బైటికొస్తారని తెలుగు సంఘాలు భరోసానిస్తున్నాయి.

Recommended For You