అమెరికాలోని ఫర్మింగ్‌టన్ యూనివర్శిటీ కేసులో విచారణ షురూ..

Telangana--associations-step in as students panic

అమెరికాలోని ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్శిటీ వ్యవహారంలో కీలక నిందితులు కోర్టుకు హాజరయ్యారు. భారత విద్యార్థులకు ఫేక్‌ వీసాలు ఇప్పించిన 8 మంది స్టూడెంట్‌ రిక్రూటర్స్‌ను డెట్రాయిట్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పే టూ స్టే కింద ఫర్మింగ్‌ వర్శిటీలో సుమారు వందలాది విద్యార్థులను అక్రమ పద్ధతిలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేవలం 8 మందిపై నేరారోపణ కింద విచారణ జరుగుతోంది.

Also Read : విజయ్‌మాల్యాకు బ్రిటన్ షాక్..

ఫార్మింగ్టన్‌ ఫేక్‌ యూనివర్శిటీ వ్యవహారంలో పోలీసుల వలలో చిక్కిన తెలుగు విద్యార్థులు అందర్నీ విడిపించేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. ముఖ్యంగా అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ విద్యార్థులకు బెయిల్‌ ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు న్యాయసహాయం అందించడంతో పాటు, ఎప్పటికప్పుడు ఇమిగ్రేషన్‌ అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. క్రియాశీలకంగా ఉన్న అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ తెలుగు విద్యార్థులకు అన్ని విధలుగా అండగా ఉంటోంది.

Recommended For You