అమావాస్య నాడు అప్పన్న సన్నిధిలో తెప్పొత్సవం

సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వరహా పుష్కరిణిలో తెప్పొత్సవం వైభంగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ తెప్పొత్సవం. ప్రతిఏటా బహుళ పుష్య అమావాస్య నాడు ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read : అమిత్‌ షాకు షాక్.. కమలనాథుల ఆశలు గల్లంతు

స్వామివారు మొట్ల మార్గం గుండా సాయంత్రం కొండదిగువకు చేరుకుని పుష్కరిణిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హంస వాహనంపై వేణుగోపాలస్వామి అవతారంలో మూడు సార్లు పుష్కరిణిలో విహారయాత్ర చేశారు. భక్తులు అధిక సంఖ్యంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుష్కరిణి అంతా విద్యుత్‌ దీపకాంతులతో అందంగా ముస్తాబై అకట్టుకుంది.. పుష్కరణి ప్రాంతమంతా హరినమ స్మరణతో మోరుమోగింది.

Recommended For You