కౌగిలింతల ఉద్యోగం.. ఏడాదికి రూ.28 లక్షల ఆదాయం..!!

బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఓదారిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది. నీకేం కాదు నీనున్నాను అంటూ దగ్గరకు తీసుకుంటే మరింత సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఓదార్పులో కొండంత భరోసా కనిపిస్తుంది. ఆప్యాయంగా కౌగిలించుకుంటే అందులో అనిర్వచనీయమైన ఆనందం ఉంటుంది.

నిజానికి బాధ తీరకపోయినా కాస్త రిలాక్స్ అవుతారు. మరి ఆ ప్రేమ పూర్వక కౌగిలింతను నేనిస్తానంటోంది రాబిన్ స్టినెకి. అమెరికాలోని కన్సార్‌కి చెందిన రాబిన్ మీరెక్కడున్నారో చెప్పండి. మీ బాధను పంచుకుని మిమ్మల్ని ఓదార్చడానికి నేనే అక్కడికే వచ్చేస్తానంటోంది.

అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా నా కౌగిలిలో బందీ అయిపోవచ్చంటూ అంతకు మించి ఏం చేసినా అయిపోతార్రోయ్.. అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది. నిజానికి ఇలా కౌగిలించుకుని ఓదార్చాలనే ఆలోచన తనకు జరిగిన అనుభవంలో నుంచి వచ్చిందే అంటారు రాబిన్.

ఒకప్పుడు తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నానని, అప్పుడు సహాయం చేసే వారు లేకపోగా కనీసం ఓదార్చే వారు కూడా లేక తానెంతో కృంగి పోయానని తెలిపింది. అందుకే అప్పుడే నిర్ణయించుకున్నా బాధల్లో ఉన్న వారికి నేను చేయగలింది ఏదైనా ఉందా అని ఆలోచించినప్పుడు కౌగిలికంటే మించిన ఓదార్పు లేదనిపించింది.

ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టింది. దాన్నే ఆదాయంగా మలచుకుంది. బాధలో ఉన్న వ్యక్తి చేతిలో చేయిపెట్టి.. శరీరాన్ని నిమురుతూ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆక్సిటోసిన్ రిలీజై ఒత్తిడి దూరమవుతుంది. ఇది ఓ థెరపీలాంటిదని చెబుతోంది రాబిన్. మరి ఇందుకు గాను తాను గంటకు రూ.5630లు వసూలు చేస్తానని అంటోంది.

ఆమె ఓదార్పులో స్వాంతన పొందుతున్న వ్యక్తులు కూడా మాకు ఇదేం పెద్ద లెక్కకాదంటున్నారు. ఈ విధంగా రాబిన్ ఏడాదికి రూ.28 లక్షల వరకు సంపాదిస్తోందట. సో.. అదండీ.. కౌగిలింతల ఉద్యోగం.. కథా కమామిషు. మీరూ ట్రై చేస్తారా ఏవిటి.. ఇక్కడ ఇలాంటి ఉద్యోగం చేస్తానంటే చెప్పిచ్చుకొడతారండి బాబు.. ఫారిన్ లోనే ఇలాంటి కొత్త కొత్త ఉద్యోగాలు కనిపెట్టి అమలు పరిచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. మనకెందుకండీ ఆ గొడవ.. ఓకే.

Recommended For You