ప్రముఖ నటి ఝాన్సీ సూసైడ్

ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణం తీసింది. టీవీ నటిగా ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న ఆమె.. జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది. మాటీవీలో పవిత్రబంధం సీరియల్‌లో నటించిన ఝాన్సీ.. మంగళవారం రాత్రి సూసైడ్ చేసుకుంది. కొన్నాళ్లుగా తను ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అతనితో సహజీవనం కూడా చేసినట్టు తెలిసింది. ఐతే.. ఈ విషయంలో తల్లిదండ్రులకు, ఝాన్సీకి మధ్య గొడవ జరిగింది. ప్రేమ కారణంగా కెరీర్‌ వదులుకుని, నటనకు దూరం అవడం విభేదాలకు కారణమైంది. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ సూసైడ్ చేసుకుంది.

Also Read : రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్‌ సినిమాను తలపించిన జయరాం హత్య కేసు

శ్రీనగర్ కాలనీలోని శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన ఝాన్సీ.. కొన్నాళ్ల కిందటే హైదరాబాద్‌ వచ్చింది. సోదరుడితో కలిసి ఉంటోంది. పలు సీరియళ్లలోనూ నటించింది. అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్‌ కూడా నడుపుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఝాన్సీ సూసైడ్‌పై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టంకు తరలించారు.

Recommended For You