ఉద్దేశపూర్వకంగా విద్యార్ధులు అమెరికాలో ఉండాలని తప్పుచేశారు – అమెరికా

Telangana--associations-step in as students panic

అమెరికాలో అరెస్టు అయిన భారతీయ విద్యార్ధుల విషయంలో తీవ్రంగా స్పందించింది. వారందరికీ అక్రమంగా ఉంటున్నామని.. తప్పు చేస్తున్నామని తెలుసని భారత విదేశంగశాఖకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ఫార్మింగ్‌టన్ విశ్వవిద్యాలయంలో భోధనావ్యవస్థ లేదన్న విషయం కూడా తెలుసు.. వారి ఉద్దేశం అక్రమంగా అమెరికాలో ఉండటమే అంటోంది అమెరికా. ఇది తీవ్రమైన కేసుగా చూడాల్సి ఉంటుందని అమెరికాకు చెందిన అధికారప్రతినిధి స్పష్టం చేశారు.

అయితే అమెరికా వాదనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం నకిలీదని భారత విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి వివరించారు. ఏజెంట్లను, విద్యార్ధులను ఒకేరకంగా భావించి కేసులు పెట్టొద్దని కోరింది. వీలైనంత త్వరగా విద్యార్ధులను విడుదల చేయాలని భారత్‌ కోరింది. విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని తెలిపింది. విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించాలని అమెరికాను కోరింది.

Also Read : రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్‌ సినిమాను తలపించిన జయరాం హత్య కేసు

విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిని పట్టుకోవాలని భావించిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. అందులో భాగంగా 8 మంది దళారులను, వారి ద్వారా చేరిన 130 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టుపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి తిప్పిపంపితే వారికి మళ్లీ వీసా లభించడం అసాధ్యమని నిపుణుల అంటున్నారు. దీంతో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వంలో సంప్రదింపులు జరుపుతుంది. అయితే ఇది పరిష్కారం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Recommended For You