పాత బైక్ ఇచ్చేస్తే రూ.6,000లు అదనంగా.. పెట్రోల్‌తో పనిలేని కొత్త బైక్..

అర్జంట్‌గా ఏదో పని మీద బయటకి వెళుతుంటే సడెన్‌గా బండిలో పెట్రోల్ అయిపోయింది.. ఓ పక్క ఆఫీసుకి కూడా టైమవుతుంది.. పెట్రోల్ బంక్ చాలా దూరంలో ఉంది.. ఇక ఇలాంటి టెన్షన్లు ఏవీ పెట్టుకోనవసరం లేదంటోంది హీరో కంపెనీ.

ఎంచక్కా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చి ఎంత దూరమైనా హ్యాపీగా వెళ్లిపోవచ్చంటోంది. దీంతో పాటు మరో శుభవార్తను కూడా అందిస్తోంది. అదేంటంటే మీ పాత పెట్రోల్ వాహనం తీసుకొస్తే మార్కెట్ విలువ కంటే రూ.6,000లు అదనంగా కూడా ఇస్తామంటోంది.

కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్ వాహనాలకు చెక్ పెట్టే దిశగా కస్టమర్ల కోసం ఈ వినూత్న ఆఫర్‌ని ప్రవేశ పెట్టింది హీరో కంపెనీ. పెట్రోల్ వాహనంతో పోలిస్తే బ్యాటరీ ద్వారా నడిచే ఈ వాహనం ఖర్చులను కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే బ్యాటరీపై 3 ఏళ్ల వారెంటీని కూడా అందిస్తున్నారు.

భారత్‌ని మరింత వేగవంతంగా అభివృద్ధి చెందించే దిశగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.46,000 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.87,000 వరకు ఉన్నాయి.

Recommended For You