భారత మహిళా జట్టు విజయలక్ష్యం 160 పరుగులు ..

India women vs New Zealand women 1st T20

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత మహిళాజట్టుకు ఆతిథ్య జట్టు 160 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు భారత ఓపెనర్ పునియా కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరింది. అంతకుముందు భారత్ కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచి న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది.

Also Read : ప్రముఖ నటి ఝాన్సీ సూసైడ్

ఆజట్టు ఓపెనర్ డివైన్ 48 బంతుల్లో 60 పరుగులు, కెప్టెన్ అమీ సత్తెర్త్ వెయిట్ 27 బంతుల్లో 33, కెజె మార్టిన్ 14 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో మార్టిన్, మెకే జంట రెండు సిక్సర్లు బాది ఏకంగా 20 పరుగులు రాబట్టింది.

Recommended For You