సెల్ఫీ.. ఫోన్‌తోనే దిగుతారా ఏంటి..!!

ఏంటోనండి.. నేను, నా ఫ్రెండ్సూ బడికెళ్తుంటే కాలేజీకి వెళ్లే అక్కలూ, అన్నయ్యలు ఫోన్ పట్టుకుని ఇలా ఫొటోలు దిగడం చూశానండి. వీళ్లనే కాదండి దార్లో చాలా మంది ఆంటీ, అంకుల్స్ కూడా ఎక్కడ పడితే ఆగి ఇలా ఫొటోలు దిగుతున్నారండి.

ఇంటికెళ్లాక మా అమ్మని అడిగానండి. అమ్మా అదేంటో ఫోన్ పట్టుకుని అందరూ ఫోటోలు దిగుతున్నారు. అది నాక్కూడా కావాలన్నానండి. అంతే.. దానికి మా అమ్మ చెప్పుచ్చుకు కొడతానందండి. దాంతో నాకో ఐడియా వచ్చేసింది.

వెంటనే మా ఫ్రెండ్స్ అందర్నీ నిలబెట్టేసి ఫోటోకి ఫోజు ఇమ్మని చెప్పేసానండి. చెప్పుతోనే సెల్పీ దిగేసామండి. వాళ్ల ఫోటో కంటే మా ఫోటోనే బావుంది కదండీ. అందుకే మీక్కూడా నచ్చి లైకులు కొడతారని కాలేజీకి వెళ్లే ఓ అక్కని బతిమాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించానండి. మరి మీరు కూడా లైక్ కొడతారు కదా. థాంక్యూ అండీ..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోపై వారి స్పందనలు తెలియజేశారు. చిన్నారుల అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డారు కొందరు. మరికొందరు ఆనందంగా ఉండాలంటే డబ్బే ప్రధానం కాదని పోస్టులు పెట్టారు.

Recommended For You