రెడ్‌మీ ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన షియోమీ

xiaomi-redmi-6-series-smart-phones-price-cut-in-india

చైనాలో ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న రెడ్‌మీ 6 ఫోన్ల ప్రియులకు శుభవార్త అందించింది. ఈ ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. దీంతో రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ ఫోన్ల ధ‌రలు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు త‌గ్గాయి. రెడ్‌మీ 6కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.500 తగ్గి రూ.8,499 ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తుండ‌గా, రెడ్‌మీ 6ఎ కు చెందిన 2జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర కూడా రూ.500 త‌గ్గింది. దీంతో ఈ ఫోన్‌ రూ.6,499 కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే 6 ప్రొకు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.1000 త‌గ్గి రూ.8,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి త‌గ్గి రూ.10,999 ధ‌ర‌కు లభిస్తోంది. అయితే ఈ త‌గ్గింపు ధ‌ర‌లు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయని షియోమీ తెలిపింది.ి.

Recommended For You