బెంగాల్‌ సీఎం మమతకు బీజేపీ చీఫ్‌ వార్నింగ్‌

Amit Shah vs Mamata, amit shah vs mamata banerjee,

బెంగాల్‌ సీఎం మమతకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలో తమకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే మమతా.. డ్రామాలు ఆడుతున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారాయన. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను 23 సీట్లలో కమలం విరబూసేవరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదన్నారు.

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు..

బెంగాల్‌కు రాకుండా బీజేపీ నేతలను అడ్డుకోవడంపై అమిత్‌ షా నిప్పులు చెరిగారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారని, తన హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతించలేదన్నారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు అమిత్‌ షా. ప్రధాని మోడీ సభకు చిన్న మైదానం కేటాయించి, దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్‌పై ఫైర్ అయ్యారు. పోలీస్‌ అధికారికి వత్తాసు పలుకుతూ కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్‌ షా.

Recommended For You